యజమానే హంతకుడు…భార్య ప్రేరణతోనే హత్య

The owner is Assassin... wife is murdered with inspiration

భార్య ప్రేరణతోనే హత్య్ల
వీడిన హత్య కేసు మిస్టరీ

మన తెలంగాణ/ ఖమ్మం క్రైం: యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. భార్య ప్రేరణతో యజమానే హత్య చేసినట్టు తేలింది. 21న మిస్సింగ్ న మోదైన మిస్సింగ్‌ను త్రీ టౌన్ సిఐ ఉప్పుల వెంకన్నబాబు నేతృత్వంలో పోలీసులు ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం… గార్ల మండలం పోచారం గ్రామ పంచాయతీలోని ముత్తితండాకు చెందిన భూక్యా రమేష్(30) ట్రాక్టర్ డ్రైవర్. ఇతనికి భార్య కమలతోపాటు ఇద్దరు సంతానం. రమేష్ నాలుగున్నర సంవత్సరాలుగా గార్లకు చెందిన ఆగా ల రామారావు అలియాస్ రాముడు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. రామారావు తరచూ రమేష్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈక్రమంలో కమలతో రామారావుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజూ రమేష్‌ను ట్రాక్టర్‌తో పంపించి రామారావు కమలతో గడిపేవాడు. ఒక రోజు రామారావు కమలతో ఉండగా రమేష్ చూశాడు. ఈ విషయం లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మరొకరి తో వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని రమేష్ భార్యను తరచూ కొడు తూ ఉండేవాడు. దీంతో ఎలాగైనా రమేష్‌ను అడ్డు తొలగించుకోవాలని రామారావు, కమల పధకం రచించారు. ఈక్రమంలో జూన్ 12వ తేదీన ట్రాక్టర్ మరమ్మతుకు రమేష్ ఖమ్మం వచ్చాడు. ఈక్రమంలో పాత మి త్రుడు జెసిబి డ్రైవర్, ఒకప్పుడు రామారావు దగ్గర పనిచేసిన సురేష్ కలిశాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఎక్కువ జీతం ఇస్తానని సురే ష్ చెప్పడంతో రమేష్ వెంటనే రామారావుకు ఫోన్ చేశాడు. ఉద్యోగం మానేస్తున్నానని చెప్పాడు. తన మనసేం బాలేదని రైల్వేస్టేషన్‌లో ఉన్నానని, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటాని తెలిపాడు. ఇదే అదనుగా భావించిన రామారావు అతని వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న గార్ల మండలం గోపాలపురానికి చెందిన గుండోజు కృష్ణాచారిని తీసుకుని ఖమ్మం బయలుదేరా డు. కమల సూచనలతో రమేష్‌ను అంతమొందిచడానికి యుద్ధ ప్రాతిపదికన పథకం సిద్ధం చేశారు. హత్య చేసి సురేష్ మీదకు తోసెయ్యాలని భావించారు. రైల్వే స్టేషన్‌కు చేరుకుని రమేష్‌తో కొంతసేపు మాట్లాడారు. సురేష్ దగ్గరికి వెళ్లి మాట్లాడుదామని నమ్మ బలికారు. సురేష్ ఇంటికని చెప్పి కూసుమంచి తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. పెరికసింగారం, రాజుపేట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మళ్లీ మద్యం సేవించారు. ముందుగానే అనుకన్న పథకం ప్రకారం కృష్ణాచారి రమేష్‌ను గట్టిగా పట్టుకోగా రామారా వు బ్లేడుతో పీకకోసి హత్య చేశాడు. శవాన్ని అక్కడే ఉన్న పాలేరు కాల్వలో పడేసి ఇంటికెళ్లి పోయారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కమల భావించింది. 21వ తేదీన రా మారావును తీసుకుని ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి భర్త కనబడటం లేదని ఫిర్యాదు చేసింది. కేసును తీసుకున్న త్రీ టౌన్ సిఐ వెంకన్న బాబు తన సిబ్బందితో విచారణ ముమ్మరం చేశారు. భార్య తీరుపైనే సందేహం రావడంతో కాల్ డేటా సేకరించారు. రామారావుతో పలుసార్లు మాట్లాడినట్టు తెలియడంతో అతడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కమల సూచనలతో కృష్ణాచారి సహాయంతో తానే హత్య చేసినట్టు రామారావు అంగీకరించాడు. హత్య చేసి ప్రదేశాన్ని చూపగా శవం కుళ్లిపోయిన దశలో ఉంది. పోస్టుమార్టం అ నంతరం రామారావు, కృష్ణాచారిలను పోలీసుల రిమాండ్ చేశారు. కమ ల పరారీలో ఉంది. ఈ విషయంలో ఎసిపి గంటా వెంకట్రావ్‌ను వివరణ కోరగా రామారావు, కృష్ణాచారి, కమలపై హత్య, అట్రాసిటీతోపాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కమల పరారీలో ఉందని వెంటనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ వెంకన్నబాబును ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలాఉండగా గార్లలోని రామారావు ఇంటి ఎదుట శవంతో రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంది. వందల మంది అక్కడకు చేరుకుని ధర్నా చేస్తుండడంతో గార్లలో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనగా మారింది.