యంగ్ క్రికెటర్‌తో షారుఖ్ తనయ ప్రేమాయణం..?

Who is this Young KKR player SRK's daughter Suhana Khan is crushing on?

ముంబయి: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరు, కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ సుహానా ఖాన్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు షారుఖ్ సహయజమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపిఎల్ పదకొండో సీజన్‌లో కోల్‌కతా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే కోల్‌కతా ఆడిన మ్యాచ్‌లకు తండ్రి షారుఖ్‌తో కలిసి సుహానా కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌లు ముగిసిన అనంతరం సుహానా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్‌గిల్ తో ఎక్కువగా ముచ్చటించడం చేసిందట.

shubman-gill-with-suhana-kh

అంతటితో ఆగకుండా టోర్నీ ముగిసిన అనంతరం కూడా వీరిద్దరూ ఇప్పుడు బయట డిన్నర్లు, పార్టీలంటూ తిరుగుతున్నారట. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్త ప్రస్తుతం బీటౌన్‌లో వైరల్ అవుతోంది. మరికొందరైతే ఓ అడుగుముందుకేసి సుహానా గిల్‌తో ప్రేమలో పడిందంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు గానీ ఇప్పుడైతే సామాజిక మాద్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Suhana-Khan-and-shubman-gil

కాగా, 17 ఏళ్ల సుహానా ప్రస్తుతం ముంబయిలోని ధీరుభాయ్ అంబానీ అంతర్జాతీయ స్కూల్‌లో చదువుతోంది. ఇక 19 ఏళ్ల శుబ్‌మన్ గిల్ అండర్-19 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి, ఐపిఎల్‌లో కోల్‌కతాకు ఆడాడు. ఇక్కడ కూడా మంచి ప్రదర్శనతో గిల్ ఆకట్టుకున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు గిల్ ఆడటం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక క్రికెటర్లు, సినీ తారలు ప్రేమలో పడటం సాధారణమే. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు కూడా వెళ్లాయి. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహమాడిన విషయం విదితమే. ప్రస్తుతం మరో క్రికెటర్ కెఎల్ రాహుల్, నటి నిధి అగర్వాల్ లు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా దుమారం రేపుతున్నాయి.

Comments

comments