మోడీకి రాఖీలు కట్టిన చిన్నారులు…

దేశంలో రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండగను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వారి నివాసాల్లో చిన్నారులు, మహిళలు రాఖీలు కట్టారు. మహిళలు రాఖీలు కడుతున్న చిత్రాలను మోడీ, నాయుడులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కాగా, ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి వందకు పైగా విద్యార్థినులు ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రక్షా బంధన్ రక్షణకు చిహ్నమన్నారు. […]

దేశంలో రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండగను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వారి నివాసాల్లో చిన్నారులు, మహిళలు రాఖీలు కట్టారు. మహిళలు రాఖీలు కడుతున్న చిత్రాలను మోడీ, నాయుడులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కాగా, ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి వందకు పైగా విద్యార్థినులు ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రక్షా బంధన్ రక్షణకు చిహ్నమన్నారు. ఐక్యత, మానవత్వానికి ప్రతీక అన్నారు. అదే విధగా ప్రధానిమోడీ తన రేడియో కార్యక్రమమైన మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ విభిన్న మతాలను, అన్ని ప్రాంతాల ప్రజలను ఈ రక్షా బంధన్ ఐక్యం చేస్తుందన్నారు.

Comments

comments