మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందాం

Let's preserve the environment of plants

మన తెలంగాణ/అల్లాదుర్గం : ప్రభుత్వం యజ్ఞంలా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిరక్షించి పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం నాడు అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో హరితహారంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కొందరు అధికారులు నిర్లక్షంగా తూతూ మంత్రంగా కాగితాలకే లెక్కలు చూపడమే కాదు మొక్కలను నాటి వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగినప్పుడే ఈ కార్యక్రమ ఫలితం ఉంటుందన్నారు. తెలంగాణలో అటవీసంపద 12శాతానికి పడిపోవడంతో సరైన సమయంలో వర్షాలు కురియగా ప్రజలు ఎంతో నష్టపోతున్నారని, అడవులు పెంపొందించుకోవడానికి ప్రభుత్వం ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు, దీని ద్వారా 33శాతం అడవులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్వచ్ఛమైన గాలి లభించకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీని కోసం ప్రతి గ్రామంలో ఈ సంవత్సరం 40వేలకు తగ్గకుండా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. నాటి మొక్కలలో 85శాతం బతికేలా అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ ద్వారా గ్రామస్తులకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ద లోపం వలన 75శాతం ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాడుపడాలని అన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి అధికారులు, గ్రామ పంచాయతీ