మొక్కలతోనే ప్రాణ వాయువు

odor of the oxygen becomes the reason for society's illness

పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన

మనతెలంగాణ/ఓదెల: ప్రాణవాయువు అంతరించి సమాజం అనారోగ్యానికి హేతువుగా మారుతుందని మొక్కలు పెంచడంతో ప్రాణవాయువు సంరక్షణతోపాటు భావితరాలకు కానుకగా వృక్షసంపదను ఇచ్చే పద్దతి ప్రతీ ఒక్కరూ ఆచరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవ సేన అన్నారు. మండలంలోని మడక గ్రామంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమానకి ఆమె ముఖ్య అతిధిగా హా జరై మాట్లాడుతూ విత్తన బంతుల తయారీ ప్రాచీన సాప్రదాయమని పూర్వం ఈ విత్తన బంతుల ద్వారానే ఇప్పుడున్న వన సంపద అని విత్తన బంతుల ద్వా రా ప్రతీ గ్రామంలో లక్ష మొక్కలను జిల్లాకు రెండు కోట్ల లక్షంతో ముందుకు సాగుతున్నామని, ఇందులో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు ని చ్చారు. చెట్లు మనిషి పుట్టి నప్పటినుండి మరణించే వరకు మనకు అవసరమని, కానీ మన అవసరం చెట్టుకు లేదని ఉద్ఘటించారు.
రాబోవు కాలంలో ఆక్సిజన్ సైతం కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడకుండా అంతరించి పోయే వృక్షసంపదను అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో చేపట్టాలని సూచించారు. కలెక్టర స్వయంగా విత్తన బంతులను తయారు చేసి, వాటి తయారీలో జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భం గా పెద్దపల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ కాళుష్యరహిత సమాజ నిర్మాణానికి మానవ మనుగడకు వృక్షసంపద తోడ్పడుతుందని. పోలీస్ శాఖద్వారా కూడా మండలంలో మొక్కలు నాటుటకు పోలీస్ యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. మొక్కను నాటిన వారు వాటిని సంరక్షించినప్పుడే చేసిన పని గొప్పగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గట్టు రమాదేవి, డిపివో వేముల సుదర్శన్, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఎస్సై ఇస్సాక్ పాషా, ఎంఈవో రాజయ్య, సర్పంచ్ ఆవుల గట్టమ్మ, ఎంపిటిసి హన్మంతరావు, మ్యేడగోని శ్రీ కాంత్, కావేటి రాజు,ఎస్‌ఐ ఓంకార్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, వి ద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. హరితహారంపై వి ద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించిన కలెక్టర్ పాఠశాలకు ప్రోత్సాహకంగా 5లక్షల అభివృద్ధి పనులకు నిధులను కేటాయించారు.