మైనర్ రేప్ బాధితులకు పరిహారం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : అత్యాచారానికి గురైన మైనర్ బాలికలకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. దీన్ని వచ్చే అక్టోబర్2 నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పోక్సో చట్టంలో పరిహారం అనే నిబంధన లేదని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన స్కీమ్ ప్రకారం రేప్ బాధితురాలికి రూ.4లక్షల నుంచి రూ.7లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది. రేప్ […]

ఢిల్లీ : అత్యాచారానికి గురైన మైనర్ బాలికలకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. దీన్ని వచ్చే అక్టోబర్2 నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పోక్సో చట్టంలో పరిహారం అనే నిబంధన లేదని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన స్కీమ్ ప్రకారం రేప్ బాధితురాలికి రూ.4లక్షల నుంచి రూ.7లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది. రేప్ కేసులో ప్రాణాలు కోల్పోయినా, సామూహిక అత్యాచారానికి గురైన బాధితుల కుటుంబాలకు ఈ పరిహారం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంది. ఈ క్రమంలోనే మైనర్లకు కూడా పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పోక్సో చట్టానికి సవరణలు చేసే వరకు ఈ పరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

Minor Rape Victims Entitled to Compensation : Supreme Court

Comments

comments

Related Stories: