మైనర్ బాలిక హత్యచారం కేసులో నిందితుడు అరెస్టు

నిర్మల్‌ : సోన్ మండలంలో ఆదివారం జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పి శశిధర్‌రాజు వెల్లడించారు. ఈ నెల 16వ తేదిన సోన్ గ్రామానికి చెందిన స్పందన అనే మైనర్ బాలిక ఆడుకోవడానికి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి రాకపోవడంతో తల్లిదండ్రులు నరేష్ పై సోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి బాలికలను మోటర్ సైకిల్ […]

నిర్మల్‌ : సోన్ మండలంలో ఆదివారం జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పి శశిధర్‌రాజు వెల్లడించారు. ఈ నెల 16వ తేదిన సోన్ గ్రామానికి చెందిన స్పందన అనే మైనర్ బాలిక ఆడుకోవడానికి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి రాకపోవడంతో తల్లిదండ్రులు నరేష్ పై సోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి బాలికలను మోటర్ సైకిల్ పై తీసుకొని గ్రామ శివారులోకి వెళ్లినట్టు సమాచారం తెలియడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించడం జరిగిందన్నారు. విచారణలో నిందితుడు బాలికను అత్యచారం చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో నిందితుడికి సహాకరించిన మరోక మైనర్ బాలుడు గణేష్‌ను కూడా అరెస్టు చేయడం జరిగిందన్నారు. సెక్షన్ 303, 376ల ప్రకారం… ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి గణేష్‌ను కోర్టుకు పంపడం జరిగిందన్నారు. ఈ ఇద్దరి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కేసును చేదించిన సోన్ పోలీసులను ఎస్పి అభినందించారు. విలేకరుల సమావేశంలో ఆడిషన్ ఎస్పి దక్షిణామూర్తి, డిఎస్పి మనోహార్‌రెడ్డి, సిఐ, ఎస్‌ఐలు ఉన్నారు.

Comments

comments

Related Stories: