మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌తో వివొ ‘వి11 ప్రొ’

Vivo V11 Pro phone with in-display fingerprint scanner

ఇప్పటి వరకు తక్కువ ధరకు మంచి ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను అందించిన చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు వివొ తన కొత్త ప్రొడక్ట్ ‘వి11 ప్రొ’ను భారత విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6న ఈ ఫోన్ విడుదల కానుంది. స్క్రీన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉండడం ‘వి11 ప్రొ’ ప్రత్యేకత. అంతేగాక 660 ఎఐఇ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ పవర్‌ఫుల్ ప్రొసెసర్ ఇందులో ఉంది. దీంతో మొబైల్ వేగంగా పనిచేయనుంది. 6జిబి ర్యామ్‌తో దీన్ని తీసుకువస్తోంది వివొ కంపెనీ. అలాగే ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాలు రెండు కూడా ఎఐతో కూడిన పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. దాంతో వెలుతురు సరిగా లేని చోట కూడా ఫోటోలు సూపర్‌గా వస్తాయి. అయితే, ‘వి11 ప్రొ’ సంబంధించిన ధర , స్క్రీన్ సైజు, కెమెరా, బ్యాటరీ తదితర వివరాలను వివొ అధికారికంగా ప్రకటించలేదు. కాగా, బయటకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ మొబైల్ 6.41 ఇంచుల ఫుల్ హెచ్‌డి సూపర్ అమోలెడ్ తెర, 12 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాలతో పాటు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రానుందని తెలిసింది. అలాగే 3400 ఎంఎహెచ్ బ్యాటరీ విత్ డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుందట. దీంతో ఫోన్ త్వరగా చార్జ్ అవుతుంది. ఇలా అద్భుతమైన ఫీచర్స్‌తో ‘వి11 ప్రొ’ను వివొ తన వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తోంది. ఇక ఇండియాలో వివొ మంచి మార్కెటింగ్ ను కలిగి ఉండడంతో ఈ కొత్త మొబైల్ ఫోన్ కూడా భారత కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయమని కంపెనీ భావిస్తోంది.

Comments

comments