మేలైన జీవనశైలితోనే ఆరోగ్యం

సంతాన వైఫల్యం కేసులను, ప్రమాదకరమైన గర్భిణి కేసులను పరీక్షించి ఎలాంటి రిస్కు లేకుండా వైద్య చికిత్స నిర్వహించడంలో డా॥కె.శిల్పిరెడ్డి మంచి పేరు గడించారు. వైద్యవృత్తిలో 15 ఏళ్లకు పైగా అనుభవంకలిగి యశోదా గ్రూపు హాస్పిటల్స్(హైదరాబాద్) ద్వారా అబెస్టిట్రిక్స్, గైనకాలజీలో డిఎన్‌బి పూర్తి చేశారు. తమిళనాడులోని అన్నామలై యూనివర్శిటీ ద్వారా డయాబెటాలజీ లో పిజి డిప్లొమా పొందారు. ముంబై బీమ్స్ ద్వారా లాప్రొస్కోపిక్ సర్జరీలో 2007లో ఫెలోషిప్ సాధించిన శిల్పిరెడ్డి తో మన తెలంగాణ ‘పల్స్’ ఇంటర్వూ.. మీ […]

సంతాన వైఫల్యం కేసులను, ప్రమాదకరమైన గర్భిణి కేసులను పరీక్షించి ఎలాంటి రిస్కు లేకుండా వైద్య చికిత్స నిర్వహించడంలో డా॥కె.శిల్పిరెడ్డి మంచి పేరు గడించారు. వైద్యవృత్తిలో 15 ఏళ్లకు పైగా అనుభవంకలిగి యశోదా గ్రూపు హాస్పిటల్స్(హైదరాబాద్) ద్వారా అబెస్టిట్రిక్స్, గైనకాలజీలో డిఎన్‌బి పూర్తి చేశారు. తమిళనాడులోని అన్నామలై యూనివర్శిటీ ద్వారా డయాబెటాలజీ లో పిజి డిప్లొమా పొందారు. ముంబై బీమ్స్ ద్వారా లాప్రొస్కోపిక్ సర్జరీలో 2007లో
ఫెలోషిప్ సాధించిన శిల్పిరెడ్డి తో మన తెలంగాణ ‘పల్స్’ ఇంటర్వూ..

మీ దగ్గరికి ఎక్కువగా మహిళలు ఏ సమస్యలతో వస్తున్నారు…
గర్భసంచికి సంబంధించిన సమస్యలు, గర్భాశయ క్యాన్సర్లు, ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్లు ఎక్కువగా వస్తున్నారు. సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు. సరియైన జీవన విధానం లేకపోవట మే వీటన్నింటికి కారణం. సరియైన జీవన విధానంతో ఆరో గ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సంతానోత్పత్తి సమస్య కూడా తగ్గుతుంది. ఎక్కువగా ఈ మధ్య మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
ఉద్యోగస్తులైన స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి….
ఉద్యోగస్తులైన మహిళలకి ఎక్కువగా హార్మోన్స్ సమస్యలు వస్తున్నాయి. రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ బరుగు పెరగడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం వల్ల ఈ హార్మోన్ అసమతుల్యత వస్తోంది. రుతుచక్రం ఒక పద్ధతిగా, టైమ్ ప్రకారం రాకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే మన బయోలాజికల్ పద్ధతి ప్రకారం రాత్రిపూట హార్మోన్స్ విడుదల అవుతాయి. ఆ సమయంలో ఉద్యో గం చేసే మహిళలకి హార్మోన్స్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమయానికి భోజనం చేయరు. వీరిలో ఎక్కువగా విటమిన్ లోపంతో వుంటున్నారు. జంక్‌ఫుడ్ లాంటివి రాత్రిపూట ఎక్కువగా తినేస్తున్నారు. కేలరీలు ఎక్కువయి ఒబేసిటీ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార సమస్య ఎక్కువ గా కనపడుతోంది. దాంతో థైరాయిడ్ డిసీజ్‌తో పాటు రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
గర్భాశయ క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తలు…
మహిళలు క్రమపద్దతిలో రోజూ ఒకే సమయం లో ఆహారం తీసుకోవడం, సంతులిత ఆహారం, పౌష్టికాహా రం భుజించాలి. తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజూ ఒకే టైమ్‌కి పడుకోవాలి. టైమ్‌కి తినటం టైమ్‌కి పడుకోవటం పాటించాలి.8-10 గంటలు సమయం నిద్రకు కేటాయించాలి. లేటుగా నిద్రపోతే హార్మోన్స్ సమస్య వస్తుంది. ఇంతే కాకుండా వ్యాయామం అనేది మహిళలకు చాలా అవసరం. ఎంతో కొంత వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. రక్త ప్రసరణ సరిగా లేక బిపి, షుగర్స్ లాంటివి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. రోజంతా ఒకే ప్లేస్‌లో కూర్చుని డ్యూటీలు చేస్తుంటారు. దీనిమూలంగా వీరికి ఊబకాయం సమస్య వ స్తోంది. ఆహారపుటలవాట్లు సక్రమంగా ఉండాలి. ఒత్తిడి సమస్యలు తగ్గించుకోవాలి. ఇటువంటి వారు యోగా, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేస్తే మంచిది.
సోషల్ మీడియా కూడా కారణమే..
పిల్లలు సోషల్ మీడియాకి బాగా అలవాటుపడుతున్నారు. ఫేస్‌బుక్‌లు చూడటం, వాట్సప్‌లు, గూగుల్, మెసేజెస్ లాంటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవన్నీ ఆరోగ్యానికి హానికారకాలు. బయటి ఆహారం తినకుండా ఉండటమే మంచిది. బయటినుండి తెచ్చుకున్న ఆహారం తినకుండా ఇంట్లో వండుకున్న ఆహారం తింటే మంచిది.
ఆడపిల్లలకి ఎక్కువగా ఐరన్, బికాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్స్ ఉన్న ఆహారం ఎక్కువగా పెట్టాలి. పిల్లలకి పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇండియాలో ఆడవారు ఎక్కువగా పోషకాహార లోపంతో ఉంటున్నారు. తినడానికి సరియైన సమయాన్ని పాటించటం లేదు. ఇవన్నీ సరిగా లేకపోతే మహిళలకు ఋతుసంబంధ సమస్యలు వస్తాయి. ఐరన్, కాల్షియం, ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని మహిళలు ఎక్కువగా తీసుకోవాలి.
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?
40 ఏళ్ళ దాటిన ప్రతి మహిళ మామోగ్రఫీ చేయించుకోవాలి. ప్రతి నెలా సొంతంగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లాలి.
థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి?
ఈ థైరాయిడ్ అనేది ఏ వయసు వారికైనా రావచ్చు. మహిళలకు డెలివరీ సమయంలో వచ్చే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లలలో పెరుగుదల లేనప్పుడు, చురుకుగా లేనప్పు డు థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిది. విటమిన్‌డి లోపంతో కూడా థైరాయిడ్ సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకా ఆహార నియమాలు సరిగా లేకపోయినా, అయొడిన్ తగ్గినప్పుడు, ఊబకాయం ఉన్నా, ఎక్కువ ఒత్తిడికి గురయినా థై రాయిడ్ సమస్యలు పెరుగుతాయి. బి.పి, షుగర్, లాంటి వ్యాధులు కూడా హార్మోన్స్ అసమతుల్యత, వ్యాయామం లేకపోవటం, బరువు పెరగటం మూలంగా సంభవిస్తాయి.

Related Stories: