మేడమ్ టుస్సాడ్స్ లో దీపికా పదుకొనే మైనపు విగ్రహం..

Deepika Padukone to get wax statue at Madame Tussauds

లండన్: లండన్ లో గల ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో  బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు మ్యూజియంలో  కొలువుదీరిన విషయం తెలిసిందే. లండన్, ఢిల్లీ గల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో  దీపికా పదుకొనే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు  చేయనున్నట్టు సమాచారం. మేడమ్ టుస్సాడ్స్ ప్రతి నిధులు ఇప్పటికే లండన్ లో దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫోటోలు తీసుకున్నారు. టుస్సాడ్స్ ప్రతినిధులు తనను కలవడం ఎంతో గౌరవంగా ఉందని దీపికా ఆనందం వ్యక్తం చేసింది.