మెరుగైన సేవలు అందించడమే లక్షం

The goal is to better services provide

మన తెలంగాణ/నిర్మల్/నర్సాపూర్(జి ):  ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలందించడమే లక్షంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలందించేందకు కృషి చేస్తుందన్నారు. బుధవారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రజావైద్యానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులలో సకల వసతులతో మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కెసిఆర్ కిట్ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో కిడ్ని, డయాలసిస్ సేవలందిస్తున్నామన్నారు. నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలో అమ్మ ఒడి అంబులెన్స్‌ను ఉంచనున్నట్లు తెలిపారు. గ్రామంలోని మసీదుల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.15లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. అనంతరం జరిగిన పంట పెట్టుబడి చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రైతులకు చెక్కులు, పట్టదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

Comments

comments