మెబైల్ షాపులో భారీ చోరీ

నిర్మల్‌టౌన్‌: పట్టణంలోని మండల పరిషత్ ఎదుట గల ఓ మెబైల్ షాప్‌లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ దొంగతనంలో భారీగా నగదుతో పాటు విలువైన ఫోన్‌లు అపహారణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గల యూనినార్ షాపులో దొంగలు చొరబడ్డారు. షాపు షెట్టర్‌ను గడ్డపారతో తొలగించి అందులోని వస్తువులను అపహరించడంతో పాటు నగదును దోచుకెళ్లినట్టు బాధితులు నరేందర్ తెలిపారు. ఎప్పటి మాదిరిగానే ఉదయం షాపుకు వచ్చి చూడగా షెర్టర్ […]

నిర్మల్‌టౌన్‌: పట్టణంలోని మండల పరిషత్ ఎదుట గల ఓ మెబైల్ షాప్‌లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ దొంగతనంలో భారీగా నగదుతో పాటు విలువైన ఫోన్‌లు అపహారణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గల యూనినార్ షాపులో దొంగలు చొరబడ్డారు. షాపు షెట్టర్‌ను గడ్డపారతో తొలగించి అందులోని వస్తువులను అపహరించడంతో పాటు నగదును దోచుకెళ్లినట్టు బాధితులు నరేందర్ తెలిపారు. ఎప్పటి మాదిరిగానే ఉదయం షాపుకు వచ్చి చూడగా షెర్టర్ కొద్దిపాటిగా తెరిచి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మెబైల్ షాపులోని కౌంటర్‌లో ఉంచిన 5 లక్షల 20వేల నగదుతో పాటు వివిధ కంపెనీలకు చెందిన మెబైల్ ఫోన్ లు, విలువైన మెమోరీకార్డ్‌తో పాటు పలు మెబైల్‌కు సంబంధించిన వస్తువులు అపహరణకు గురైనట్టు బాధితుడు వాపోయాడు. పోలీసులు వివరాలు సేకరించడంతో పాటు క్లూస్ టీంను రప్పించి నమూనాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Stories: