మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలి

నాణ్యతగల భోజనం సకాలంలో అందజేత కలెక్టర్ శ్వేతామహంతి మన తెలంగాణ/వనపర్తి : మెనుప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. భోజనం నాణ్యత, మెనుపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. శనివారం ఆమె వనపర్తి పట్టణ పరిధిలోని చిట్యాల గ్రామ సమీపంలో శ్రీచైతన్య ఫౌండేషన్ సహకారంతో పాఠశాల విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే డిఈఒ సుశీందర్‌రావు, ప్రధానోపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం పథకం సమీక్షించారు. ప్రస్తుతం […]

నాణ్యతగల భోజనం సకాలంలో అందజేత
కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/వనపర్తి : మెనుప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. భోజనం నాణ్యత, మెనుపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. శనివారం ఆమె వనపర్తి పట్టణ పరిధిలోని చిట్యాల గ్రామ సమీపంలో శ్రీచైతన్య ఫౌండేషన్ సహకారంతో పాఠశాల విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే డిఈఒ సుశీందర్‌రావు, ప్రధానోపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం పథకం సమీక్షించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న   కూరల్లో నూనె,కారం  కొంచెం ఎక్కువగా వాడాలని ,భోజనం నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని ,అలాగే మెను ప్రకారం భోజనం అందించాలని చెప్పారు. భోజనం నాణ్యత  సకాలంలో భోజనాన్ని సరఫరా చేసే విషయంలో ప్రతి ప్రధానో పాధ్యాయుడు రోజుకొక ఉపాధ్యాయున్ని చిట్యాల కిచెన్ షెడ్డుకు డిప్యూట్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటశాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు . కార్యక్రమంలో డిఈఒ సుశీందర్ రావు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: