మెడికల్ దుకాణల దందా..!

వెల్గటూర్: మండలంలో మెడికల్ దుకాణల దందా యధేచ్ఛగా సాగుతుంది . నిబంధనలను పాటించకుండా ఫార్మస్‌స్టులు లేకుండానే మందులు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా నిర్వహిస్తున్నారు. మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకోవలసిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా బి ఫార్మసి పూర్తి చేసి ఉండాలి, కాని మెడికల్ యాజమానులు ఆ దృవపత్రాలను అద్దెకు తీసుకోని దుకాణాలను నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఇదే తంతూ కోనసాగుతుంది. వినియోగదారులకు […]

వెల్గటూర్: మండలంలో మెడికల్ దుకాణల దందా యధేచ్ఛగా సాగుతుంది . నిబంధనలను పాటించకుండా ఫార్మస్‌స్టులు లేకుండానే మందులు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా నిర్వహిస్తున్నారు. మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకోవలసిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా బి ఫార్మసి పూర్తి చేసి ఉండాలి, కాని మెడికల్ యాజమానులు ఆ దృవపత్రాలను అద్దెకు తీసుకోని దుకాణాలను నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఇదే తంతూ కోనసాగుతుంది. వినియోగదారులకు ఔషధాలను అందించేందుకు కచ్చితంగా ఫార్మస్‌స్టులే ఉండాల్సి ఉండగా చాల ఔషధ దుకాణాల్లో అటువంటి నిబంధనలు లేకుండానే మందులు విక్రహిస్తూన్నారు. మరికోంత మంది యాజమానులు పది, ఇంటర్ చదివిన వారిని దుకాణాలో పెట్టుకొని విక్రయాలు సాగిస్తున్నారు. వైద్యలు రాసే మందుల చీటి ఫార్మస్‌స్టులకు మాత్రమే అవగహన ఉంటుంది, కాని మందుల షాప్ పై ఎటువంటి అవగహన లేని వారిని దుకాణల్లో పెట్టుకొని మందులు విక్రహించడం వల్ల ఒక మందుకు బదులుగా మరొక మందు ఇచ్చి వారి రోగాలను మరోమలుపు తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది మెడికల్ షాప్ లో ఇచ్చిన మందులను వైద్యునికి చూపిస్తే మేము రాసిన మందులు ఇవి కాదని చెపుతుండటం విడ్డురంగా ఉంటుంది. ఇలాంటివి అధికంగా ఉన్న బయట పడకుండా యాజమానులు జాగ్రత్త పడుతున్నారు. విటిపై వినియోగదారులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక యాజమానులతో గొడవ పడి వెలుతున్నారు. ప్రతి దుకాణం ఎదుట నియంత్రణ అధికారుల నెంబర్లు తెలియపర్చాల్సి ఉండగా అలాంటివి ఏవి ఉండడం లేదు. మరో వైపు 10 ఇంటూ 12 పరిమాణంలో దుకాణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటికంటే తక్కువ పరిమాణం గల గదుల్లో ఏర్పాటు చేస్తున్నారు.

దుకాణంలో ఫార్మసిస్టు ఉండడు
దుకాణంలో ఉండే ఫార్మసిస్టు పేరు, అర్హత పత్రం జిరాక్స్‌కాపి, ఇతర వివరాలు వినియోగదారులకు కన్పించేలా ఉంచాలి. 90 శాతం దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. దుమ్ము, దూళీ ఔషధ దుకాణాల్లో ప్రవేశించకుండా అద్దాలతో కూడిన అళమారాలను ఏర్పాటు చేయాలి. కాని కొన్ని దుకాణాలు మాత్రమే వీటిని పాటిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది వీటిని పాటించడం లేదు. ఔషధ నియంత్రణ అధికారి దుకాణాలను తరచూ తనిఖీ చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్ని దుకాణాలు రెన్యూవల్ చేయకుండానే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దుకాణాల్లో ఫార్మస్‌స్టు ఉండి విక్రయాలు చేపట్టాల్సి ఉండగా ఏ దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. బి.ఫార్మసిస్టు చదివిన వారు సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని దుకాణాన్ని ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఏ దుకాణంలోను ఫార్మసిస్టు అందుబాటులో ఉండటం లేదు. నెలనెల అధికారులకు మాముళ్లు ముట్టజెప్పుతూ మెడికల్ దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుచున్నా ఔషధ దుకాణాల దందాను నియంత్రించాల్సి అధికారులే చూసిచూడనట్టు గా వ్యవహరిస్తుండటం కొసమెరుపు .

Comments

comments

Related Stories: