మృత్యువులోను వీడని పేగు బంధం

Two lives sacrificed due to neglect of Electrical Officers

సింగరేణి: తల్లి పేగు బంధాన్ని పెను వేసుకొని పుట్టిన కొడుకు, పురటి నొప్పులును ఓర్చి జన్మనిచ్చిన తల్లి.. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ తల్లి ఆ కొడుకును ప్రేమగా ముద్దాడుతూ.. కడుపన పెట్టుకొని పెంచింది. విద్యా దశ ప్రారంభం కాగానే ఆ పిల్లవాడిని బడిలో చేర్పించారు. ఆరు ఏళ్లుగా ప్రేమానురాగాల నడుమ సాగిన వీరి జీవితాన్ని చూసి విధి అసూయ పడి మృత్యువు రూపంలో ఫ్యాన్ కబలించినప్పటికి. తల్లి, కొడుకును వేరు చేయలేకపోయింది. ఇది ఇలా ఉంటే పెళ్లి చేసుకొని నూరేల్లు కలిసి ఉండాల్సిన భార్య ఓ వైపు, తన కడ వరకు ఉండాల్సిన కన్న కొడుకు జీవితం పసి తనంలోనే ముగిసిపోయిందని కళ్లల్లో కన్నీటి దారను ఆపుకోలేని కుటుంబ యజమాని. మరో వైపు తనకు అండగా ఉండి సమాజంలో ఎలా నడుచుకోవాలని తెలిపే తల్లి, తనతో రోజు ఆడుకునే తమ్ముడు ఇక రారని కుమిలి కుమిలి ఏడుస్తున్న బాలిక… ఆ కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన శుక్రవారం సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సింగరేణి కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ విభాగంలో ఎస్ అండ్ పిసిలో సెక్యూరిటీ గార్డుగా ఎస్. కె. హుస్సేన్ రుద్రంపూర్‌లోని క్లబ్ ఏరియాలో డి.. 126 క్వార్టర్స్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వర్షం వస్తున్నప్పటికి హుస్సేన్ భార్య నజుమా (35) తన కొడుకు అర్హాన్ (6) కు ప్రతి రోజులాగే స్కూల్‌కు పంపించేందుకు స్నానం చేయిస్తుంది. ఈ స్నానమే తన చిన్నారి కొడుకుకు తన చివిరి స్నానం అవుతుందని తెలియని ఆ తల్లి, కొడుకులను పక్కంటి ఫ్యాన్ మృత్యవు రూపంలో కబలించివేసింది. మృత్యువులోను పేగు బంధం వీడని తల్లి కొడుకులు విద్యుత్‌ దఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. హుస్సేన్ నివాసం ఉంటున్న డి..126 క్వార్టర్ ప్రక్కనే ఉన్నా డి.. 125 క్వార్టల్లో సీలింగ్ ఫ్యాన్ మరమత్తులకు గురై విద్యుత్ సరఫరా అవుతుంది. ఆ ఫ్యాన్‌కి బిగించిన పైప్ ద్వారా డి.. 126 కావ్వర్టర్‌కు కూడా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో బట్టలు ఆరేసేందుకు కట్టిన దండం తీగకు విద్యుత్ సరఫరా అయి అర్హాన్‌కు స్నానం చేయిస్తున్న సమయంలో దండం తీగ తగిలి విద్యుత్‌ దఘాతానికి గురి కావాడంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి తల్లి నజుమా కూడా మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో నజుమా కూతురు, భర్త లేరని, వారుంటే ఈ ప్రమాదానికి వారు కూడా బలయ్యేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు బోరుమని విలపిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. తల్లి, కొడుకులు మృతి చెందిన సంఘటన తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రంపూర్ ఏరియాలో విషాద చాయలు అలుముకున్నాయి. 2 టౌన్ సిఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. ఆయన వెంట ఎస్‌ఐ అమీర్‌జాని, పోలీసు సిబ్బంది ఉన్నారు.

మృతుల కుటుంబాన్ని పరమార్శించిన అధికారులు, నాయకులు…
సింగరేణి అధికారులు ఎస్‌ఓటూ జిఎం నారాయణరావు, ఎజిఎం పర్సనల్ పి. శ్రీనివాస్, డివై జిఎం ఎలక్ట్రికల్ బి.డి.బి. ప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. శ్రీనివాస్‌రావు, పర్సనల్ మేనేజర్ కిరణ్‌బాబు, టిబిజికెస్ నాయకులు కె. ఎం. విక్టర్, రజాక్, కుమార్, టిఆర్‌ఎస్ నాయకులు గూడెల్లి యాకయ్య, భిక్షపతి, మృతదేహాలను సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సింగరేణి ఎలక్ట్రికల్ అధికారుల నిర్లక్షం…
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నివాసం ఉంటున్న కార్మికుల కాలనీలో ఏరియా ఎలక్ట్రికల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపనలు వెలువెత్తుతున్నాయి. శుక్రవారం రుద్రంపూర్‌లో విద్యుత్‌ దఘాతానికి గురై మృతి చెందిన తల్లి, కొడుకుల సంఘటనే అందకు నిదర్శనమని కార్మికులు, ఎఐటియుసి నాయకులు అంటున్నారు. విద్యుత్ స్థంభాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు సక్రమంగా ఉండవని, కార్మికుల క్వార్టర్లలో ఎర్త్ పైపులు ఏర్పాటు చేయకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.