మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్

Police seized  Three Illegal Sand Transport Tractors

నర్సింహులపేటః మండలంలోని జయపురం గ్రామ శివారులోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లును మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌రావు తెలిపారు.ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా జయపురం ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకు తరలిస్తుండటంతో బాధ్యులైన ట్రాక్టర్ యాజమానులపై కేసు నమోదు చేసి 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకొని వాహన యాజమానులతో పాటుగా డ్రైవర్లపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ హెచ్చరించారు.

Comments

comments