మూక దాడుల దోషులపై కఠిన చర్యలు

 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం  లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన న్యూఢిల్లీ: ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేటు చేసుకున్న అమాయకులపై జనం దాడి చేసి కొట్టి  చంపిన సంఘటనలను కేంద్రం గురువారం తీవ్రంగా ఖండిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సలహా ఇచ్చిందని తెలిపింది. అంతేకాకుండా, పుకార్లు, తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకోవడానికి  తనిఖీలను ఏర్పాటు చేయాలని  సామాజిక మీడియా సేవలను అందించే సంస్థలను కోరింది. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో […]

 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

 లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ: ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేటు చేసుకున్న అమాయకులపై జనం దాడి చేసి కొట్టి  చంపిన సంఘటనలను కేంద్రం గురువారం తీవ్రంగా ఖండిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సలహా ఇచ్చిందని తెలిపింది. అంతేకాకుండా, పుకార్లు, తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకోవడానికి  తనిఖీలను ఏర్పాటు చేయాలని  సామాజిక మీడియా సేవలను అందించే సంస్థలను కోరింది. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యు డు కెసి వేణుగోపాల్ జనం గుంపులు అమాయకులను కొట్టి చంపడాన్ని, గత వారం జార్ఖండ్‌లో స్వామి  అగ్నివేశ్‌పై జరిగిన దాడిని,విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌పై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని లేవనెత్తినప్పుడు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందిస్తూ ఒక ప్రకటన చేశారు. జనం కొట్టి చంపిన ఘటనల్లో చాలా మంది చనిపోయారని ఆయన అంటూ, ఇది ప్రభుత్వానికితీవ్రంగా   అన్నారు.    తప్పుడు వార్తల కారణంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని ఆయన అంటూ, అయినప్పటికీ ాంద్రం చూ స్తూ ఉండలేదని అన్నారు. 2016 లో,2018లో రెండుసార్లు తాను రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, వీటిని అడ్డుకోవడానికి అవసరమైన చెక్‌లను ఏర్పాటు చేయాలని సోషల్ మీడి యా సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఆదేశించినట్లు తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులను కోరినట్లు కూడా రాజ్‌నాథ్ చెప్పారు. తొలుత ఈ అంశాలను లేవనెత్తిన వేణుగోపాల్ మాట్లాడుతూ,దాడి చేసి కొట్టి చంపడాలు, తమ అభిప్రాయాలను వ్యతిరేకించే వారిపై దాడి చేయడం ఇప్పుడు మామూలై పోయిందని, అయినా ప్రభుత్వం మౌనంగా ఉం టోందని అన్నారు. అంతేకాదు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మూక దాడులకు పాల్పడిన వారికి  దండలు వేసి సన్మానించారని ఆయన అన్నారు. కాగా వేణుగోపాల్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బిజెపి సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగలడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇది దేశానికి సంబంధించిన తీవ్ర సమస్య అని  కాంగ్రెస్ నేతలు మల్లికార్జునఖర్గే, జ్యోతిరాదిత్య సింధియాలు గట్టిగా అభ్యంతరం చెప్తూ, తమ సభ్యుడు తన ప్రసంగాన్ని కొనసాగించడానికి అనుమతించాలని సభాపతిని కోరడం కనిపించింది.

Related Stories: