మూకదాడులపై దద్దరిల్లిన లోక్ సభ

Discussion on Cow protection attacks in lok sabha

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్ సభలో మూకదాడులపై చర్చ జరిగింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న మూకదాడులపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. ఈ దాడులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో అధికార పక్ష సభ్యులు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో లోక్ సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మూకదాడులకు కేంద్రం ఎంతమాత్రం సహించదనీ, కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సభలో వెల్లడించారు. మూకదాడులు ఇప్పటివి కావని, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని రాజ్ నాథ్ మండిపడ్డారు. నాలుగు వారాల్లో హై లెవల్ కమిటీ నివేదిక వస్తుందన్నారు.