ముగ్గురు వ్యక్తులని కొట్టి చంపిన గ్రామస్థులు…

Villagers Killed Three Persons in Bihar

బిహార్: ముగ్గురు దుండగులను గ్రామస్థులు కొట్టి చంపిన సంఘటన బిహార్ లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగూసరాయ్ లోని ఓ పాఠశాల వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి ఓ బాలిక గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. ఆడవాళ్లు వ్యవసాయ పనులు ముగించుకుని ఇండ్లకు తిరిగి వెళ్తుండగా బడి దగ్గర ఏదో సందడి అనిపించి అటుగా వెళ్లారు. దుండగులు ఆయుధాలతో బెదరించి ఓ బాలికను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో  ఆడవాళ్లు ఊరివాళ్లని అప్రమత్తం చేశారు. ఊరి నుంచి వచ్చిన గ్రామస్థులు దుండగులను తరిమితరిమి కొట్టారు. పారి పోతున్న దుండగులలో ముగ్గురు గ్రామస్థుల చేతికి చిక్కారు. అందరి కలిసి కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments