ముంపు గ్రామల్లో వెల్లు విరిసిన ఆనందం

వెల్గటూర్ ; మండలంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల్లో ఆనంద చాయలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి ముంపు గ్రామాలైన ముక్కరావుపేట, రాంనూర్ నిర్వాసితులకు రాష్ట్ర గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్ మంత్రి కృష్ణారావుతో పాటు ఆర్‌ఆండ్‌ఆర్ కమీషన్, పిఆర్ ప్రన్సిపాల్ సెక్రటరీ వికాస్‌రాజ్ సానుకూల స్పందనతో ఆనందం వెల్లువిరుస్తుంది. వెల్గటూర్ ఎంపిపి పోనుగొటి శ్రీనివాసరావు అధ్వర్యం లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి ముంపు గ్రామా సర్పంచ్‌లు యాగండ్ల కవిత తరుపతి, బిడారి తిరుమల తిరుపతి, […]


వెల్గటూర్ ; మండలంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల్లో ఆనంద చాయలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి ముంపు గ్రామాలైన ముక్కరావుపేట, రాంనూర్ నిర్వాసితులకు రాష్ట్ర గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్ మంత్రి కృష్ణారావుతో పాటు ఆర్‌ఆండ్‌ఆర్ కమీషన్, పిఆర్ ప్రన్సిపాల్ సెక్రటరీ వికాస్‌రాజ్ సానుకూల స్పందనతో ఆనందం వెల్లువిరుస్తుంది. వెల్గటూర్ ఎంపిపి పోనుగొటి శ్రీనివాసరావు అధ్వర్యం లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి ముంపు గ్రామా సర్పంచ్‌లు యాగండ్ల కవిత తరుపతి, బిడారి తిరుమల తిరుపతి, ముంపు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ముక్కట్‌రావుపేట గ్రామానికి సంబధించిన బి.సి కాలనీ నష్టపరిహారం చెల్లింపు, రాంనూర్ గ్రామానికి చెందిన 53 కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కోక్క కుటుంబానికి 2లక్షల నష్టపరిహారంను మంత్రి జూపల్లి కృష్టారావు సానూకులంగా స్పంధించడం జరగింది. ముంపు నిర్వాసితుల సమస్యలపైన ప్రభుత్వ చీప్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక శ్రదతో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత అధికారులతో చర్చించి చర్యలు చేస్తున్నారు. ముంపు గ్రామాల సమస్యలను తీర్చుటలో చోరువ చూపుతున్న ఎంపిపి పోనుగొటి శ్రీనివాసరావుకు, ప్రభుత్వచీప్‌విప్ , ధర్మపురి ఎంఎల్‌ఎ కొప్పుల ఈశ్వర్ లకు ముంపుగ్రామాల నిర్వాసితులు కృతజ్ఞతలు తెలుపుచున్నారు.