ముంపు గుప్పిట పల్లెలు

Filling the reservoirs

వరద తాకిడికి జనం అతలాకుతలం
నిండుతున్న జలాశయాలు
ఆందోళనలో లోతట్టు ప్రాంతాలు 

మనతెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా జలకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం ఉధృతమవుతోంది. దీని కార ణంగా ప్రాజెక్టుల్లోని బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్న పల్లెలన్ని ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.
ఇప్పటికే ముధోల్ నియోజక వర్గంలోని పల్సికర్ రంగారావ్ ప్రాజెక్టు వాటర్‌తో గుండేగాం తదితర గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దీనికితోడుగా మరికొన్ని గ్రామాలు సైతం ముంపు బారిన పడే అవ కాశాలున్నట్లు హెచ్చరి కలు జారీ అవుతు న్నాయి. దీనికితోడుగా తూర్పు, పశ్చిమ జిల్లాలోని అనేక మారుమూల గ్రామాలు వరద ఉధృతికి విలవిలలాడుతు న్నాయి. వాగులు పొంగి,పొర్లుతున్నాయి. రిజ ర్వాయర్, ప్రాజెక్టు లలో వరద నీరు ఉధృతంగా వచ్చి చేరు కుంటుండడంతో ఒకటి, రెండు రోజుల్లో గేట్లు సైతం వదిలేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని అనేక లోతట్టు వార్డులు ఇప్పటికే జలమ యమ య్యాయి.
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని దెబ్బతింటున్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం స్థంభించింది. ఇదిలాఉండగా పలు ప్రాంతాలలో పంట చేలు సైతం జల మయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షం కురిస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇప్పటికే పంట చేలల్లో ఇసుక మేటలు వేసి వందలాది ఎకరాలలో పంట నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. అలాగే వాగుల పక్కనే ఉన్న చేలతో పాటు కుంటలు, చెరువుల అలుగుల నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహించి పంటలు కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. వర్షం తగ్గిన తరువాత పంట నష్టం వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉందని రెవెన్యూ, వ్యవసాయాధికారులు అంటున్నారు. ఐదు రోజుల క్రితం వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు పడిన రైతులు, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఇక పంటలతో పాటు గడ్డి సైతం పెరిగిపోతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పంట చేలల్లో మరో ఐదు రోజుల వరకు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.