మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో తహసీల్దార్ భేటీ

Thahasildar meeting with your service centers

సర్టిఫికెట్ల అలసత్వంపై సిబ్బందిపై తహసీల్దార్ ఫైర్
సకాలంలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిచేలా చర్యలు

మనతెలంగాణ / మణుగూరు రూరల్ : గత రెండు రోజుల క్రితం మనతెలంగాణలో ‘కనికరించని రెవి న్యూ సిబ్బంది’ అనే శీర్షికతో వెలువడిన వార్తాకథనానికి గురువారం తహసీల్దార్ నారాయణమూర్తి స్పం దించారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకునే మీ సేవ కేం ద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ మీసే వ నిర్వాహకులకు పలు సూచన లు ఇచ్చారు. సకాలంలో సమయానికి మీ సేవ కేంద్రాలు తెరవాలని, మీ సేవ కార్యాలయాలలో పరిశుభ్రత గా ఉంచి కేంద్రాలకు వ చ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల మర్యాదపూర్వకం గా నడుచుకోవాలన్నారు. అంతేకాకుండా దరఖాస్తు కు అయ్యే ఖర్చు సరైన ధరల పట్టికను కేంద్రంలో బో ర్డుల రూపంలో ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల వ ద్దనుండి వ్యక్తిగతంగా అధిక సొమ్ము వసూలు చేసిన ట్లు సమాచారం వస్తే మీ సేవ కేంద్రాలపై కఠిన చర్య లు తీసుకుని, మీసేవ కేంద్రాలను సీజ్ చేయ డం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల, ధృ వీకరణ పత్రాల విషయంలో మీ సేవ కేంద్రాలు సరైన పద్దతిలో పని చేయాలని సూచించారు. ఎట్టకేలకు మ నతెలంగాణ కథనానికి తహసీల్దార్ స్పందించి మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మండల ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.