మిస్త్రీకి స్వల్ప ఊరట

వాటాలను విక్రయించాలని టాటా సన్స్ ఒత్తిడి చేయజాలదు : ఎన్‌సిఎఎల్‌టి న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట లభించింది. మిస్త్రీకి చెందిన వాటాలను విక్రయించాలని టాటా సన్స్ ఒత్తిడి చేయజాలదని శుక్రవారం ఎన్‌సిఎల్‌ఎటి(నేషనల్ కంపెనీ లా అప్పల్లేట్ ట్రిబ్యునల్) స్పష్టం చేసింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీలోకి టాటా సన్స్ మారే విషయంలో ఆదేశాలు చేసేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంతవరకు కంపెనీలో వాటాలను విక్రయించాలని సైరస్ మిస్త్రీని టాటా […]

వాటాలను విక్రయించాలని టాటా సన్స్ ఒత్తిడి చేయజాలదు : ఎన్‌సిఎఎల్‌టి

న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట లభించింది. మిస్త్రీకి చెందిన వాటాలను విక్రయించాలని టాటా సన్స్ ఒత్తిడి చేయజాలదని శుక్రవారం ఎన్‌సిఎల్‌ఎటి(నేషనల్ కంపెనీ లా అప్పల్లేట్ ట్రిబ్యునల్) స్పష్టం చేసింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీలోకి టాటా సన్స్ మారే విషయంలో ఆదేశాలు చేసేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంతవరకు కంపెనీలో వాటాలను విక్రయించాలని సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఒత్తిడి చేయజాలదని జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తుది విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా మార్పు అంశంపై ఈ కేసులో తుది వాదనల తరువాత నిర్ణయిస్తామని తెలిపింది. ఆగస్టు 14న ఎన్‌సిఎఎల్‌టి ఆదేశాలను రిజర్వు చేసింది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని ఆకస్మికంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను ట్రిబ్యునల్ స్వీకరించింది.

ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరైనదేనని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్‌సిఎల్‌టిలో న్యాయమూర్తులు ప్రకాశ్ కుమార్, సేనపతిల బెంచ్ తీర్పును సైరస్ సవాల్ చేశారు. గత 101 సంవత్సరాలుగా 1917 నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందని టాటాసన్స్ న్యాయవాది వాదించారు. కాగా గత ఏడాది టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి ఉద్వాసనకు గురైన అనంతరం టాటా గ్రూప్‌లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలుదారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పదవీ విరమణ ప్రకటించిన తర్వాత 2012లో సైరస్ మిస్త్రీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం తర్వాత మిస్త్రీని సంస్థ ఆకస్మికంగా తొలగించడం వీరి మధ్య వివాదానానికి కారణమైంది.

Comments

comments

Related Stories: