మిషన్ భగీరధ నీటిని ప్రారంభించిన చైర్‌పర్సన్

Mission bhagiratha the water is launched
జనగామ : పట్టణంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తామని జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులో మిషన్ భగీరధ ద్వారా నీళ్ళు అందించేందుకు 150 మీటర్ల పైప్‌లైన్ ఇంటింటికి నల్లా కనెక్షన్లు స్థానిక కౌన్సిలర్ జక్కుల అనితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ది చేస్తున్నామని. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం మేరకు ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గుడికందుల క్రిష్ణ, కమాలోద్దీన్, కందుల రాజు,బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments