మినీ గురుకులాల ఉద్యోగుల జీతాలు పెంపు…

State government has increased salaries of mini gurukul employees

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్టు సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రకటించారు. హెచ్ఎం, వార్డెన్ కు రూ.5 వేల నుంచి రూ.21 వేలకు, సిఆర్ టిలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. పిఇటిలకు రూ.4 వేల నుంచి రూ.11 వేలకు, అకౌంటెంట్ కు రూ.3,500 నుంచి రూ.10,000, ఎఎన్ఎమ్ లకు రూ.4 వేల నుంచి రూ.9వేలకు, కుక్స్‌కు రూ.2500 నుంచి రూ.7500 కు, ఆయాలకు రూ.2500 నుంచి రూ.7500 కు, హెల్పర్‌కు రూ.2500 నుంచి రూ.7500కు, స్వీపర్‌కు రూ.2500 నుంచి రూ.7500కు, వాచ్‌మెన్‌కు రూ.2500 నుంచి రూ.7500కు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సిఎం కెసిఆర్ సంతకం చేశారు.

Comments

comments