మిథాలీ మరో రికార్డు..

గాలె: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన మిథాలీ తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు కెప్టెన్ వ్యవహరించిన క్రికెటర్‌గా మిథాలీ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మిథాలీ ఈ రికార్డును అందుకుంది. ఇప్పటి వరకు మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా […]

గాలె: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన మిథాలీ తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు కెప్టెన్ వ్యవహరించిన క్రికెటర్‌గా మిథాలీ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మిథాలీ ఈ రికార్డును అందుకుంది. ఇప్పటి వరకు మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్ పేరిట ఉంది. ఎడ్వర్డ్ 117 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ మ్యాచ్ ద్వారా మిథాలీ రాజ్ 118 వన్డేలకు సారథ్యం వహించి ఎడ్వర్డ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. దీంతో అత్యధిక మ్యాచుల్లో కెప్టెన్‌గా ఉన్న రికార్డును మిథాలీ తన పేరిట లిఖించుకుంది. ఇప్పటి వరకు 195 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇందులో 118 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించింది. కాగా, మిథాలీ 2004లో తొలిసారి భారత కెప్టెన్సీని చేపట్టింది.

Comments

comments

Related Stories: