మా భూములు మాకివ్వండి సారూ…

మనోహరాబాద్‌ః  వ్యవసాయ భూముల నుంచి ఫారెస్ట్ అధికారులు కంచె వేయడానికి గుంతలు తీస్తున్నారు. వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు దిగులు చెందుతున్నారు. శనివారం ఫారెస్ట్ రిజినల్ అధికారులు మనోహారాబాద్ మండల పరిధిలోని రంగాయిపల్లి ఫారెస్ట్ 185 ఎకరాల చుట్టు ముట్టు సర్వే నిర్వహించి కొంతమంది రైతుల వ్యవసాయ పొలాల్లో కంచె కోసం గుంతలు తీయగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల మేలుకోరుతున్న మరోపక్క ఫారెస్ట్ అధికారులతో కంచె వేయడం సరికాదు. మా భూములు మాకిస్తే వ్యవసాయం చేసుకుంటామని […]

మనోహరాబాద్‌ః  వ్యవసాయ భూముల నుంచి ఫారెస్ట్ అధికారులు కంచె వేయడానికి గుంతలు తీస్తున్నారు. వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు దిగులు చెందుతున్నారు. శనివారం ఫారెస్ట్ రిజినల్ అధికారులు మనోహారాబాద్ మండల పరిధిలోని రంగాయిపల్లి ఫారెస్ట్ 185 ఎకరాల చుట్టు ముట్టు సర్వే నిర్వహించి కొంతమంది రైతుల వ్యవసాయ పొలాల్లో కంచె కోసం గుంతలు తీయగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల మేలుకోరుతున్న మరోపక్క ఫారెస్ట్ అధికారులతో కంచె వేయడం సరికాదు. మా భూములు మాకిస్తే వ్యవసాయం చేసుకుంటామని అంటున్నారు. ఇప్పటికైన విలువైన భూములు రైతులకే దక్కే విధంగా ప్రభుత్వం చూడాలని ఆవేధన చెందుతున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు 4వేలు ఇస్తున్న ప్రభుత్వం రైతు మేలు కొరే ప్రభుత్వం అనుకున్నప్పటికి ఇలా చేయడం సరికాదని రైతులు ఆరోపిస్తున్నారు. 132 సర్వే నంబర్‌లో గల భూమి చిన్నకారు రైతుగా బతుకుతున్న మాకు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఉన్న పొలంలో కంచే వేస్తే వ్యవసాయం చేయలేక ఇబ్బందుల పాలవుతామని ప్రభుత్వానికి వేడుకుంటూ ఇప్పటికైన ఫారెస్ట్ అధికారులను కంచే వేయకుండా ఆపి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చూడాలని రైతులు కోరుతున్నారు. పట్టాపాసు బుక్‌లు ఇచ్చిన ప్రభుత్వమే ఫారెస్ట్ అధికారుల రూపంలో భూములనుకంచేలు వేయడం ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Stories: