‘మా’లో ముసలం..!

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ‘మా’ కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ… ‘మా’ నిధులు ఐదు పైసలైనా దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే నా ఆస్తంతా రాసిచ్చేస్తానని చెప్పారు. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించాలన్నదే తమ […]

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ‘మా’ కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ… ‘మా’ నిధులు ఐదు పైసలైనా దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే నా ఆస్తంతా రాసిచ్చేస్తానని చెప్పారు. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజా మండిపడ్డారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగంపై నిరూపిస్తే శాశ్వతంగా అసోసియేషన్ నుంచి తప్పుకుంటానని నటుడు శ్రీకాంత్ అన్నారు.

Comments

comments

Related Stories: