మార్పు

ఇప్పుడు చూడు తినుబండారాలు అందరికి  అందండంతో అందరి మొహాల్లో ఎంత సంతోషం  కనిపిస్తుందో. నీ దగ్గర మిగలలేదని చూసిన రవి నీకు కొంచెం పంచాడు. ఇదే సామాజిక న్యాయం అంటే సంపాదనైనా తినే వస్తువైనా అందరికీ అందితేనే  సమాజంలో అందరూ అనందంగా ఉంటారు.

Change

సీతారాంపురంలో సుబ్బయ్య అనే వ్యాపారి ఉండేవాడు. సమీపంలోని పట్టణానికి వెళ్లి సరుకులను కొని గ్రామానికితెచ్చి ప్రజలకు విక్రయింస్తుండేవాడు. గ్రామంలో సుబ్బయ్య దుకాణం ఒక్కటే ఉండడంతో వ్యాపారం బాగానే సాగేది. సొంతానికి డబ్బు సంపాదించుకుని దాచుకోవడమే తప్ప ఏ ఒక్కరికి సాయం చేసేవాడు కాదు. దీంతో సీతారాంపురంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామల్లో కూడా అతనికి పిసినారిగా పేరుపడిపోయింది. సుబ్బయ్యకు ఎనిమిదో తరగతి చదవుతున్న నరేష్ అనే కొడుకు ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నరేష్ తండ్రికి తగినట్టే పిసినారితనాన్ని ఒంటపట్టించుకున్నాడు. పాఠశాలలో సహా విద్యార్థులతో కలిసి ఉండేవాడు కాదు. ఏదైనా తినుబండారాలు ఇంటినుంచి తెచ్చుకున్నా, బయట కొనుక్కున్నా జేబులో దాచుకుని ఒంటరిగా పక్కకు వెళ్లి తినేవాడు. తన వద్ద డబ్బులు ఉన్నాయనే అహంభావం కూడా ఉండేది. డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే భావనతో ఉండేవాడు దాంతో మిగిలిన విద్యార్థులు కూడా అతని స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు.

తన దగ్గర డబ్బులు తిను బండారాలు అందుబాటులో ఉన్నా మిగిలిన విద్యార్థులు తనతో కలిసి రాకాపోవడంతో నరేష్ అసంతృప్తిగా ఉండేవాడు. నరేష్ వద్ద డబ్బులు తినుబండారాలు ఉన్నా అతని ప్రవర్తన నచ్చని కారణంగా అవి తినాలని పించినా అతని వద్దకు మిగిలిన వారు వెళ్లలేక అసంతృప్తిగా ఉండేవారు. నరేష్ పరిస్థితిని క్లాస్ టీచర్ రాంమ్మూర్తి గమనిస్తు వస్తున్నాడు. ఒకరోజు తమ తరగతి పిల్లలను క్షేత్రపర్యటనలో భాగంగా గ్రామ శివారులోని తోటకు తీసుకెళ్లారు. రాంమ్మూర్తి తోట అంత తిరిగి చూశాక సేద తీరడానికి ఒక చెట్టుకింద అంతా పోగయ్యారు. ఆ ప్రదేశానికి కొద్ది దూరంగా ఉన్న మరో చెట్టుదగ్గరకు వెళ్లిన నరేష్ తన వెంట తెచ్చుకున్న తినుబండారాలను తిని చేతులు శుభ్రం చేసుకోవడానికి వ్యవసాయ బావి పక్కన ఉన్న మోటారు పంపు దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడబోతూ దారికి పెరిగిన చెట్టు కొమ్మని పట్టుకుని వేళ్లాడుతూ బిగ్గరగా అరిచాడు. అరుపు విన్న విద్యార్థులలో రమేష్ అనే విద్యార్థి ఒక ఉదుటున అక్కడకు పరుగు తీసి తన చొక్కా విప్పి నరేష్‌కు ఊతంగా అందించి బయటకు లాగాడు. తన ప్రాణాలు కాపాడినందుకు రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపాడు నరేష్. తన పరిస్థితి తెలిసి తన ప్రాణాలను కాపాడడానికి ఒక విద్యార్థి ముందుకు రావాడంతో నరేష్ పశ్చాత్తాపానికి లోనయ్యాడు.

జరిగిన సంఘటనకు చాలా సంతోష పడ్డాడు. సంతోషాన్ని పట్టలేక తన జేబులో ఉన్న తిను బండారాల ప్యాకెట్లని తీసి అందులోని తినే వస్తువులను విద్యార్థులందరికి పంచాడు. అందరికి పంచి కాళే చేతులతో నిల్చున్న నరేష్‌ని ఉద్దేశించి నీకు మిగలలేదు కదా ఇదిగో నాదగ్గర ఉన్నవి చెరి సగం తీసుకుందాం  అని తన దగ్గర ఉన్నదాన్ని పంచాడు రవి అనే విద్యార్థి. నరేష్‌లో మార్పును గమనించిన రామ్మూర్తి చూసావా నరేష్ నీ దగ్గర తిను బండారాలు ఉన్న వాటిని ఒంటరిగా తింటూ నీవు ఇంత ఆనందాన్ని పొందలేక పోతున్నావు. అవి అందక పోవడంతో మిగిలిన వారు ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఇప్పుడు చూడు తిను బండారాలు అందరికీ అందండంతో అందరి మొహాల్లో ఎంత సంతోషం కనిపిస్తుందో. నీ దగ్గర మిగలలేదని చూసిన రవి నీకు కొంచెం పంచాడు.

ఇదే సామాజిక న్యాయం అంటే సంపాదనైనా తినే వస్తువైనా అందరికి అందితేనే సమాజంలో అందరూ అనందంగా ఉంటారు. లేదంటే అందరికి అసంతృప్తి మిగులుతుంది. ఇక నుంచి తారతమ్యాలు లేకుండా ఒకరికి అవసరమైనప్పుడు ఇతరులు సహాయపడాలి. ఇలాగే అందరూ కలిసిమెలసి ఉండండి అని సూచించాడు. ఆ రోజు నుంచి అహంభావాన్ని వీడి తన తరగతి విద్యార్థులతో కలసిమెలసి స్నేహంగా ఉండటం అలవర్చుకున్నాడు నరేష్. పైగా తన తండ్రి సుబ్బయ్య వద్దకు వెళ్లి నాన్న మన దగ్గర ఉన్నదాంట్లో ఇతరులకు పంచితే ఎంతో ఆనందం ఉంటుంది ఇది నాకు ప్రత్యేక్షంగా తెలిసివచ్చిందంటూ తనకు క్షేత్రపర్యటనలో కలిగిన అనుభవాన్ని వివరించాడు. తన కొడుకు చెప్పిన విషయంతో సుబ్బయ్యలో కూడా మార్పు వచ్చింది. ఆయన కూడా గ్రామస్థులకు తోచిన సహాయం చేస్తూ గతంలో పిసినారి అనే పేరు స్థానంలో సుబ్బయ్య మంచి వాడు అనే పేరు తెచ్చుకున్నాడు.

పాటి మోహన్‌రెడ్డి
98484 32653

Comments

comments