మారుతినగర్‌లో వ్యక్తి హత్య

Man Murder in Marutinagar

మంచిర్యాల : జిల్లాలోని మారుతినగర్‌లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అల్లుడి ఉద్యోగం కోసం మామను హతమార్చారు. సింగరేణిలో పని చేస్తున్న మహేందర్ వచ్చే నెల 30న రిటైర్ కానున్నారు. రిటైర్ కంటే ముందే మహేందర్‌ను హత్య చేస్తే , కారుణ్య నియామకం కింద అల్లుడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని మహేందర్ భార్య, కుమార్తె కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. మహేందర్‌ని బండరాయితో మోదీ హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Man Murder in Marutinagar