మారని మందుబాబులు

There is no change in the Jail Palina

జైలు పాలైనా ఏమాత్రం మార్పు రాని వైనం
నాలుగు నెలల్లో 23 మందికి జైలు శిక్ష
పట్టుబడుతున్న మద్యం ప్రియులు 

మనతెలంగాణ/ లింగాల( అచ్చంపేట): మందుబాబులు మత్తు వదలడం లేదు. పోలీసులు వేల రూపాయలు జరిమాన విదించినా, జైలు శిక్షలు వేసినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గత నాలుగు నెలల కాలంలో లింగాల మండలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వారంలో రెండు రోజులు స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారు 30 మిల్లీ గ్రాములు దాటితే బ్రీత్ అనలైజర్ మద్యం సేవించినట్లు గుర్తిస్తుంది. ఇలా పట్టుబడిన వారికిని కోర్టులో హాజరు పరుస్తారు. ఒక వాహన దారునికి న్యాయ మూర్తి రూ. 4వేల జరిమానాతో పాటు, ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్ష విధించినా వాహన దారులలో ఎలాంటి మార్పు రావడం లేదు.

ఆల్కహాల్ శాతం ఇలా గుర్తిస్తారు
బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్‌లో ఇతనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థలను నిక్షిప్తం చేస్తారు. మద్యం త్రాగిన వ్యక్తి ఆ పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కలిగి ఉన్న ఇతేల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇతనాల్ ఎంత శాతం ఉందో నమోదు చేస్తుంది. 0 నుండి 30 మిల్లీ గ్రాములు నమోదు ఆదారంగా తెలుసుకోవచ్చు. 30 మిల్లీ గ్రాముల ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా వేస్తారు. ఇలా రెండు సార్లు దొరికితే వాహన దారుడి లైసెన్స్ రద్దు చేస్తారు. 100 మిల్లీ గ్రాములు ఆపై నమోదైతే జైలుకు పంపుతారు. పోలీసు నిబంధనల ప్రకారం ఒక యూనిట్ లేదా వంద మిల్లీ లీటర్లు రక్తంలో 0.03 శాతం లేదా 30 మిల్లీ గ్రాములకు మించి ఆల్కహాల్ ఉంటే మోటరు వాహన చట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. తాగిన మోతాదును బట్టి రూ. 2 వేలు జరిమానా, వారం నుండి పది రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరం పునరావృతం అయితే ఎక్కువ రోజుల జైలు శిక్షతో పాటు రూ. ౩ వేల నుండి రూ. 5 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి నెలలో 10 కేసులు నమోదు కాగా రూ. 12,600 జరిమానా, నలుగురికి జైలు శిక్ష, ఏప్రిల్ నెలలో 12 కేసులు నమోదు కాగా రూ. 12,600 జరిమానాతో పాటు 6 మందికి జైలు శిక్ష విధించారు. మే నెలలో 16 కేసులు నమోదు కాగా రూ. 16,800 జరిమానతో పాటు 8 మందికి జైలు శిక్ష విధించారు. జూన్ నెలలో 12 కేసులు నమోదుకాగా రూ. 14,700 జరిమానా, 5 మందికి జైలు శిక్ష విధించారు.

Comments

comments