మామడలో చిరుత కలకలం

మామడ: నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్-లింగంపల్లి ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బీమన్న గుట్ట ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గొర్రెను ఎత్తుకెళ్తుండగా కుక్కలు మొరగడంతో గొర్రెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని గొర్రెల కాపారులు లక్ష్మన్న, లింగన్న తెలిపారు. వారం రోజుల క్రితం కొరటికల్ అటవీ ప్రాంతంలో కారులో వెళ్తుండగా చిరుత కనిపించిందని అటవీ శాఖ […]

మామడ: నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్-లింగంపల్లి ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బీమన్న గుట్ట ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గొర్రెను ఎత్తుకెళ్తుండగా కుక్కలు మొరగడంతో గొర్రెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని గొర్రెల కాపారులు లక్ష్మన్న, లింగన్న తెలిపారు. వారం రోజుల క్రితం కొరటికల్ అటవీ ప్రాంతంలో కారులో వెళ్తుండగా చిరుత కనిపించిందని అటవీ శాఖ అధికారులకు సమాచామిచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని చిరుత పాదముద్రలను సేకరిస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. చిరుతను ఎలాగైనా పట్టుకొని తమకు ప్రాణ రక్షణ కల్పించండని ప్రజలు వాపోతున్నారు.

Related Stories: