మానసిక ధైర్యం కోల్పోయి ఆవేదన చెందోద్దు

హైదరాబాద్: మానసిక ఆవేదనలే ఆత్మహత్యలకు మూల కారణమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ అభిప్రాయ పడ్డారు. సమస్యలతో ఉన్న వారిని గుర్తించి వారికి మానసిక ధైర్యం కలిగేలా కౌన్సిలింగ్ ఇస్తే ఆత్మహత్యలను నివారించ వచ్చన్నారు. సోమవారం ఆత్మహత్యల నిరవారణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ షీ టీం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జెండా ఊపి సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ… ఆర్ధిక సమస్యలతోనో, కుటుంబ తగాదాలతోనో, వృత్తిపరమైన ఒత్తిడితోనో చాలా మంది మానసిక […]

హైదరాబాద్: మానసిక ఆవేదనలే ఆత్మహత్యలకు మూల కారణమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ అభిప్రాయ పడ్డారు. సమస్యలతో ఉన్న వారిని గుర్తించి వారికి మానసిక ధైర్యం కలిగేలా కౌన్సిలింగ్ ఇస్తే ఆత్మహత్యలను నివారించ వచ్చన్నారు. సోమవారం ఆత్మహత్యల నిరవారణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ షీ టీం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జెండా ఊపి సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ… ఆర్ధిక సమస్యలతోనో, కుటుంబ తగాదాలతోనో, వృత్తిపరమైన ఒత్తిడితోనో చాలా మంది మానసిక ధైర్యం కోల్పోయి ఆవేదన చెందుతుంటారని, మరికొందరు మత్తుపదార్ధాలకు భానిసలై విచక్షణ కోల్పోయి మానసికంగా కుంగి పోతుంటారని వివరించారు. అలాంటి వారిని గుర్తించి వారికి సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపించడానికి సైబరాబాద్ షీ టీం విభాగానికి ఈ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మానసిక ఆవేదనకు గురైన వారు కాని అలాంటి వారిని గుర్తించిన వారు కానీ 100 నంబరుకు సమాచారం అందిస్తే కొంత వరకు ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం డిసిపి అనసూయ, ఉమెన్ ప్రొటక్షన్ సెల్ అదనపు డిసిపి ఇందిరా, మానసిక నిపునురాలు అనితాఆమెత్ లు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: