మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్‌ను పరిశీలించిన కలెక్టర్

 The Collector of the Madannapet Mini Tank Bound

మన తెలంగాణ/నర్సంపేట : నర్సంపేట పట్టణ ప్రజలకు అతి సమీపంలో ఉన్నటువంటి మాదన్నపేట కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చి దిద్దడంతో పాటు, పార్కు, రింగ్‌రోడ్డు పనులు చేపట్టేందుకు రూరల్ జిల్లా కలెక్టర్ హరితతోపాటు, రాష్ట్ర సివిల్‌సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం పరిశీలించారు. మాదన్నపేట ఆయకట్ల సమీపంలో ఉన్నటువంటి 10 ఎకరాల 20 గుంటల పట్టాభుమితో పాటు 2 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు చేసి పార్కుగా నిర్మా ణం చేస్తామన్నారు. అయ్యప్ప స్వామి గుడి వద్ద నుంచి మాదన్నపేట కట్టమీదుగా రింగ్‌రోడ్ పనులను సమీక్షించారు. కట్టపై నిర్మాణం చేపడుతున్న శివాలయాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ రవిందర్, మున్సిపల్ చైర్మన్ వెంకట్‌నారాయణగౌడ్, మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్. తహశీల్‌దార్ పూల్‌సింగ్ చౌహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

comments