మాతృ దినోత్సవం రోజున తల్లిని కోల్పోయిన కూతురు

Mother-suicide-image

సుల్తానాబాద్‌: ప్రపంచమంతా మాతృ దినోత్సవం రోజును జరుపుకుంటుండగా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో కుటుంబ కలహలతో కలాల సబిత(30) అనే వివాహిత బావిలో దూకి  అత్మహత్య చేసుకుంది. దీంతో తన కూతురు శ్రీవల్లి (6) మాతృ దినోత్సవం రోజున కన్నతల్లిని కోల్పోయింది. భార్య, భర్తలు ముత్యంరెడ్డిలు కుటుంబ కలహలతో తరచు గోడవలు పడుతుండేవారు. దీంతో సహనం కోల్పోయిన సబిత బావి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం పై ఆమె పుట్టింటి వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్ధితి నెలకొందని తెలిపారు. సుల్తానాబాద్ సిఐ అడ్లూరి రాములు, ఎస్‌ఐ దేవేందర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.