మాజీ సిఎంపై సిబిఐ ఛార్జ్‌షీట్‌!

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ సిఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాపై సిబిఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కశ్మీర్‌లో క్రికెట్‌ స్టేడియంలు, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ నిమిత్తం బిసిసిఐ నుంచి 38 కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగం చేశారని సిబిఐ ఛార్జ్‌షీట్‌లో  పేర్కొంది. ఫరూక్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (జెకెసిఎ) మాజీ చైర్మన్‌ మహ్మద్‌ అస్లాం గోని, సెక్రటరీ సలీమ్‌ ఖాన్‌, కశ్మీర్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బషీర్‌ అహ్మద్‌ల పేర్లను కూడా సిబిఐ ఛార్జ్‌షీట్‌లో జత చేసినట్లు సమాచారం. 2002, […]

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ సిఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాపై సిబిఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కశ్మీర్‌లో క్రికెట్‌ స్టేడియంలు, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ నిమిత్తం బిసిసిఐ నుంచి 38 కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగం చేశారని సిబిఐ ఛార్జ్‌షీట్‌లో  పేర్కొంది. ఫరూక్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (జెకెసిఎ) మాజీ చైర్మన్‌ మహ్మద్‌ అస్లాం గోని, సెక్రటరీ సలీమ్‌ ఖాన్‌, కశ్మీర్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బషీర్‌ అహ్మద్‌ల పేర్లను కూడా సిబిఐ ఛార్జ్‌షీట్‌లో జత చేసినట్లు సమాచారం. 2002, 2011లో జమ్ముకశ్మీర్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ రూ.112 కోట్లు ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన ఈ నిధుల్లో రూ.43 కోట్లను బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Related Stories: