మాజీ ఎంఎల్‌ఎ మణెమ్మ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ సిఎం టి.అంజయ్య సతీమణి, మాజీ ఎంఎల్‌ఎ మణెమ్మ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చనిపోయారు. ముషీరాబాద్ నుంచి ఆమె గతంలో ఒకసారి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆమె భర్త అయిన టి.అంజయ్య 1980 అక్టోబరు నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు అవిభక్త ఎపికి సిఎంగా పని చేశారు. అంజయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలతో పాటు ఓ కొడుకు […]

హైదరాబాద్ : మాజీ సిఎం టి.అంజయ్య సతీమణి, మాజీ ఎంఎల్‌ఎ మణెమ్మ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చనిపోయారు. ముషీరాబాద్ నుంచి ఆమె గతంలో ఒకసారి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆమె భర్త అయిన టి.అంజయ్య 1980 అక్టోబరు నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు అవిభక్త ఎపికి సిఎంగా పని చేశారు. అంజయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలతో పాటు ఓ కొడుకు ఉన్నారు. మణెమ్మ మృతిపై కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related Stories: