మాజీ ఎంఎల్‌ఎ నరసింహరెడ్డి కన్నుమూత

Narasimha-Reddy-Pasess-away

 

 

హైదరాబాద్: జహీరాబాద్ మాజీ ఎంఎల్‌ఎ పట్లోళ్ల నరసింహరెడ్డి (95) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ నరసింహరెడ్డి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కొహిర్ మండలం పికె రేగడిలో నరసింహ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ టిక్కెట్ పై 1989లో జహీరాబాద్ నియోజక వర్గం ఎఎల్ఎగా ఆయన గెలుపొందారు.  కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను స్వీకరించారు.