మహేష్ నా ఫేవరేట్ హీరో

‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో సూపర్‌హిట్‌ను అందుకొని ఒక్కసారిగా స్టార్ బ్యూటీగా మారిన కథా నాయిక హెబ్బా పటేల్. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో తొలి సినిమా ‘అలా ఎలా’తో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్ వంటి  సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హెబ్బాపటేల్ ‘24 కిసెస్’ […]

‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో సూపర్‌హిట్‌ను అందుకొని ఒక్కసారిగా స్టార్ బ్యూటీగా మారిన కథా నాయిక హెబ్బా పటేల్. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో తొలి సినిమా ‘అలా ఎలా’తో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్ వంటి  సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హెబ్బాపటేల్ ‘24 కిసెస్’ సినిమాలో నటిస్తోంది. అరుణ్ అదితి హీరోగా అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో గ్లామరస్ తారగా రాణిస్తున్న హెబ్బాపటేల్ చెప్పిన ముచ్చట్లు…

జర్నలిస్టు కావాలనుకున్నా…

మా స్వస్థలం గుజరాత్. కానీ నేను ముంబయిలోనే పుట్టి పెరిగాను. అయితే చిన్నప్పుడు జర్నలిస్టు కావాలని అనుకునేదాన్ని. దీంతో నేను మాస్ మీడియాలో డిగ్రీ పూర్తిచేశాను.

అప్పుడే ఆ కోరిక కలిగింది…

హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు ప్రతి ఏడాది స్కూల్ వార్షికోత్సవంలో నేను యాంకరింగ్ చేసేదాన్ని. ‘ఈ వేడుకలో నువ్వే ప్రత్యేక ఆకర్షణగా నిలిచావని… స్కూల్ హీరోయిన్‌వి నువ్వే’ అని నా స్నేహితులు సరదాగా అనేవారు. అప్పుడే నాకు హీరోయిన్ కావాలనే కోరిక కలిగింది.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి…

మోడల్‌గా రాణించి సినిమాల్లోకి వచ్చాను. ఇక కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఎంటివి ఛానల్ వాళ్లు నిర్వహించిన ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌చేసి అందరి దృష్టిని ఆకర్షించాను. దీంతో నేను హీరోయిన్ కాగలనన్న నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ జ్యూవెలరీ యాడ్‌లో నటించడం జరిగింది. ఇది చూసిన ఫిల్మ్ మేకర్స్ నాకు తమిళ్‌లో ‘తిరుమనమ్ ఎనుమ్ నిక్కా’ అనే సినిమాలో నటించే అవకాశాన్నిచ్చారు. హీరోయిన్‌గా ఇదే నా తొలి చిత్రం.

నా అదృష్టం…

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించి నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో నటించడం నేను జీవితంలో మరచిపోలేను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి ఒక్కసారిగా నాకు స్టార్ ఇమేజ్‌ను తీసుకువచ్చింది. ‘అలా ఎలా’ సినిమా చూసి సుకుమార్ నన్ను ఈ సినిమా కోసం ఎంపికచేశారు. తెలుగులో రెండో చిత్రంలోనే నా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావించాను.

చెల్లెళ్లతోనే ఆడుకునేదాన్ని…

చిన్నప్పుడు నాకు స్నేహితులు చాలా తక్కువ. అయితే నా చెల్లెళ్లు ఇద్దరు కవలలు. వారితోనే నేను ఎక్కువగా ఇంట్లోనే ఆడుకునేదాన్ని. బయటకు ఎక్కువగా వచ్చేదాన్ని కాదు. కానీ ఇంటర్ చదువుతున్నప్పుడు ఇద్దరు, ముగ్గురితో ఎంతో స్నేహంగా ఉండేదాన్ని.

వాళ్లంటే ఇష్టం…

నా ఫేవరేట్ హీరో మహేష్‌బాబు. అలాగే అల్లుఅర్జున్, నానీ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ముగ్గురితో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

ఆ అలవాటు మానుకోవాలని…

నేను చాలా ఎక్కువగా మాట్లాడుతాను. మాట్లాడుతున్నప్పుడు చేతులను ఆడిస్తూనే ఉంటా. హీరోయిన్ అయ్యాక అందరూ గమనిస్తారు కాబట్టి ఆ అలవాటును మానుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అయినప్పటికీ కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడేస్తుంటాను.

తప్పనిసరి అయితేనే…

నేను చాలా స్టయిలిష్‌గా ఉండాలని కోరుకుంటాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్‌కు అనుగుణంగా వస్త్రాలను ధరిస్తాను. అయితే బయట ఎక్కువగా జీన్స్, టీషర్టుల్లోనే కనిపిస్తాను. హైహీల్స్ అస్సలు ఇష్టం ఉండదు. సినిమాల్లో కూడా తప్పనిసరి అయితేనే హీల్స్ వేసుకుంటా.

Comments

comments

Related Stories: