మహేష్ ‘క్లోజ్ అప్ టూత్ పేస్ట్’యాడ్ చూశారా..?(వీడియో)

Mahesh Babu Close Up video song

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘క్లోజ్ అప్ టూత్ పేస్ట్’ యాడ్ లో దర్శనమిచ్చాడు మహేష్. రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న మహేష్ ఓ అందమైన భామతో కలసి నటించిన ఈ యాడ్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ‘దగ్గరగా రా.. దగ్గరగా రా.. దగ్గరగా రావా’ అంటూ తన అందంతో యాడ్ కు మరింత ఆకర్షణను జోడించాడు ప్రిన్స్. ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లితో మహర్షి అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ కు జోడిగా పూజ హేగ్డే నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఇంకేందుకు ఆలస్యం తాజాగా విడుదలైన ప్రిన్స్ ‘క్లోజ్ అప్ టూత్ పేస్ట్’ యాడ్ వీడియోపై మీరూ ఓ లుక్కెయండి…

Comments

comments