మహేష్‌కు తల్లిదండ్రులుగా…

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమాలో మహేష్ తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తోందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జయప్రద ఈ సినిమాలో నటించడం లేదు. తల్లి పాత్రలో మరో సీనియర్ నటి జయసుధ నటిస్తోందట. ఈ విషయాన్ని జయసుధ […]

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమాలో మహేష్ తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తోందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జయప్రద ఈ సినిమాలో నటించడం లేదు. తల్లి పాత్రలో మరో సీనియర్ నటి జయసుధ నటిస్తోందట. ఈ విషయాన్ని జయసుధ స్వయంగా వెల్లడించింది. ముచ్చటగా మూడో సారి మహేష్‌కు తల్లిగా నటిస్తున్నానని ఆమె చెప్పింది. అంతేకాకుండా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇదివరకే పూర్తయిందని పేర్కొంది. ఇదిలా ఉండగా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నాడు. హీరో తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాష్‌రాజ్‌లది సూపర్‌హిట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మరోసారి పునరావృతం అవుతోంది. ఇక మహేష్ కెరీర్‌లో ఈ చిత్రం  25వది కావడంతో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. బృందావనం, ఊపిరి వంటి మంచి అభిరుచి కలిగిన సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Stories: