మహిళా మోర్చా ఆధ్వర్యంలో పల్లె నిద్ర

జగిత్యాలటౌన్: కేంద్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి నియోజకవర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్‌లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బస్తీలో బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే కర పత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పించి పథకాలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. దళితుల కోసం కేంద్రం […]


జగిత్యాలటౌన్: కేంద్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి నియోజకవర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్‌లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బస్తీలో బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే కర పత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పించి పథకాలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. దళితుల కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, బిజెపిలో అత్యధికంగా దళిత ఎంఎల్‌ఎలు, ఎంపిలు ఉన్నారని, అలాగే రాష్ట్రపతిగా దళితుడికే అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు సుజాతరెడ్డి, ఠాగూర్ విద్యాసింగ్, సుంకె యశోద, భాగ్య, బిజెపి పట్టణ అధ్యక్షుడు అన్‌కారి సుధాకర్, వంశీ, సాగర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: