మహిళా జర్నలిస్టు హత్య

Woman Journalist Murdered at Bangla

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఓ టివి ఛానల్‌లో పని చేస్తున్న మహిళా జర్నలిస్టు సుబర్నా నోడి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఆనందా టివి అనే ఓ ప్రైవేటు ఛాలన్‌లో ఆమె యాంకర్‌గా పని చేస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌కు చెందిన జాగ్రోటో పత్రికలో కూడా పని చేస్తున్నారు. సుబర్నాకు తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది. భర్త నుంచి విడాకుల కోసం ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. బైక్‌లపై వచ్చిన 12 మంది దుండగులు ఆమెపై దాడి చేసి చంపేశారు. దుండగుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Journalist Murdered at Bangla

Comments

comments