మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి..

Women confidence Face your problems
వనపర్తి: మహిళలు తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని డిఎస్‌పి.సృజన అన్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో రూరల్ డెవలప్‌మెంట్ సొసైటి సంస్థ ఆధ్వర్యంలో శనివారం గృహకార్మికుల అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎస్‌పి సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలనుద్దేశించి మాట్లాడారు. మహిళలపై, యువతులపై జరుగుతున్న దాడులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. మహిళల హక్కులకు భంగం విఘాతం కల్గిస్తే తమ దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికుల విషయానికొస్తే గృహ కార్మికులు, వితంతు స్త్రీలు తమ హక్కులపై చట్టపరమైన నిర్ణయాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అంతరాష్ట్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం హర్షనీయమన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలైన మహిళలకు డిఎస్‌పి సృజన బహుమతులు అందజేశారు. అనంతరం ఆర్‌డిఎస్ అధ్యక్షులు చిన్నమ్మ థామస్ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేం దుకు పోలీసులు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గృహకార్మికులు,వితంతు మహిళలు పాల్గొన్నారు.

Comments

comments