మహిళను చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్

అమరావతి: గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రావు విచారణ కోసం వచ్చిన మహిళపై చెప్పుతో దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే  మహిళను దుర్భాషలాడుతూ చెప్పుతో తీవ్రంగా కొట్టాడు.  ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు విచారణ నిమిత్తం మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ మహిళపై […]

అమరావతి: గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రావు విచారణ కోసం వచ్చిన మహిళపై చెప్పుతో దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే  మహిళను దుర్భాషలాడుతూ చెప్పుతో తీవ్రంగా కొట్టాడు.  ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు విచారణ నిమిత్తం మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడమేకాకుండ బండబూతులు తిట్టాడు.  నగరపాలెం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. సదరు కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుంటాని, వెంకటేశ్వర్ పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Comments

comments

Related Stories: