మహిళను చావబాదిన ఆకతాయిలు…!(వైరల్ వీడియో)

A couple beaten up by unknown people in Jharkhand's Bokaro

రాంచీ: మానవత్వం మరిచిపోయి అటవికంగా ప్రవర్తించారు కొందరు ఆకతాయిలు. మోరల్ పోలింగ్ పేరుతో మహిళ అని కూడా చూడకుండా చావబాదారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లోని బొకారో మంగళవారం చోటుచేసుకుంది. ఓ యువ జంటను అపార్థం చేసుకున్న కొందరు వ్యక్తులు పట్టపగలే వారిపై విరుచుకుపడ్డారు. మొదట మహిళతో ఉన్న వ్యక్తిని కొట్టారు. అనంతరం మహిళను చుట్టుముట్టిన ఆ గ్యాంగ్ ఆమెను కర్రలతో కొట్టారు. దెబ్బలకు తాళలేక తమను విడిచిపెట్టాలని ఆమె ఎంత బతిమాలిన వాళ్లు వదిలిపెట్టలేదు. ఈ అనాగరిక చర్యను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments