‘మహర్షి’గా మహేష్ అదరగొట్టాడు…

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు, వంశీపైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేష్ బర్త్ డే సందర్భంగా గురువారం ఉదయం విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ను తన అభిమానులతో పంచుకున్నారు ప్రిన్స్. అందరూ అనుకుంటున్నట్లు రిషి కాకుండా ‘మహర్షి’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక మహర్షి సూపర్ స్టార్ కు 25వ ల్యాండ్ […]

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు, వంశీపైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేష్ బర్త్ డే సందర్భంగా గురువారం ఉదయం విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ను తన అభిమానులతో పంచుకున్నారు ప్రిన్స్. అందరూ అనుకుంటున్నట్లు రిషి కాకుండా ‘మహర్షి’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక మహర్షి సూపర్ స్టార్ కు 25వ ల్యాండ్ మార్క్ చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో మహేష్ కాలర్ ఎగరేస్తూ ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న లుక్ రఫ్ గా చాలా బాగుంది. మునుపెన్నడు చూడని మహేష్ ను ఈ లుక్ లో చూడొచ్చు.  మ‌హ‌ర్షి అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు రిషి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అలాగే మరో ముఖ్యమైన పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌నున్నాడు. నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, పివిపి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు ‘మహర్షి’ రానుంది.

Comments

comments

Related Stories: