మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..!

Prostitution in the pursuit of Massage center in Hyderabad

హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. చిలకలగూడలో గత ఆరు నెలలుగా ఓ మసాజ్ సెంటర్ లో రహస్యంగా జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేసి నిర్వాహకుడు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరుకు చెందిన సమీర్ అగర్వాల్ 6 నెలల క్రితం మెట్టగూడలో ఓ మసాజ్ కేంద్రాన్ని తెరిచాడు. అయితే వ్యాపారం సరిగ్గా లేకపోవడంతో అతడు వేరే ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచారం దందా నిర్వహిస్తున్నాడు. దీనికోసం అమ్మాయిల ఫోటోలను ‘లోకోంటో’ వెబ్ సైట్ లో పోస్ట్ చేసి కావాల్సిన వారు తన నంబర్ కు సంప్రదించాల్సిందిగా ప్రకటన ఇచ్చాడు. ఇలా విటులతో బేరం కుదుర్చుకుని రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అగర్వాల్ చేస్తున్న పనులపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్కా సమాచారంలో అగర్వాల్ మసాజ్ కేంద్రంపై దాడి నిర్వహించారు. దీంతో అగర్వాల్, అతడి పని మనుషులు షకీల్ అలీ, సుమిత్ సర్కార్ లతో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. నిందితుల నుంచి రూ.20 వేల నగదుతో పాటు ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments