మళ్లీ మొదలుపెట్టేసింది..

‘రన్ రాజా రన్’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న యంగ్ బ్యూటీ సీరత్‌కపూర్ ఆతర్వాత కొన్ని మంచి అవకాశాలను దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత టైగర్, కొలంబస్ సినిమాల్లో నటించింది సీరత్‌కపూర్. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో కొంతకాలం తెరమరుగైపోయింది. అయితే ఆమెకు మళ్లీ అవకాశాలు వచ్చేలా చేసింది హాట్ హాట్ డ్రెస్సులతో ఈ భామ చేసిన ఫొటోషూట్‌లే.  పొట్టి డ్రెస్సులు, క్లీవేజ్ షోలతో కూడిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. […]

‘రన్ రాజా రన్’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న యంగ్ బ్యూటీ సీరత్‌కపూర్ ఆతర్వాత కొన్ని మంచి అవకాశాలను దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత టైగర్, కొలంబస్ సినిమాల్లో నటించింది సీరత్‌కపూర్. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో కొంతకాలం తెరమరుగైపోయింది. అయితే ఆమెకు మళ్లీ అవకాశాలు వచ్చేలా చేసింది హాట్ హాట్ డ్రెస్సులతో ఈ భామ చేసిన ఫొటోషూట్‌లే.  పొట్టి డ్రెస్సులు, క్లీవేజ్ షోలతో కూడిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో దర్శకనిర్మాతల దృష్టి  సీరత్‌పై  పడడంతో ఆమెకు  అవకాశాలు వచ్చాయి. అనంతరం ‘రాజుగారి గది 2’లో గ్లామర్ డాల్‌లా కనిపించి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే అల్లుశిరీష్, సురభి హీరోహీరోయిన్లుగా చేసిన ‘ఒక్క క్షణం’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది సీరత్‌కపూర్. ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆతర్వాత చేసిన ‘టచ్ చేసి చూడు’లో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో సీరత్‌కు అవకాశాలు ఆగిపోయాయి. అమ్మడి చేతిలో పనిలేకుండా పోయింది. అయితే ఎప్పటిలాగే సీరత్‌కపూర్ హాట్ ఫొటోషూట్లు మొదలుపెట్టేసింది. యూత్‌ను మైమరపించే ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ అందాల కనువిందు సీరత్‌కు మళ్లీ అవకాశాలు తెచ్చిపెడతాయా అనేది చూడాల్సిందే.

Comments

comments

Related Stories: