మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price Continue Rise
ముంబయి: పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగాయి. రూపాయి విలువ పతనం కావడంతో పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికి తోడు ఇరాన్ పై యుఎస్ఎ విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగాయి. శుక్రవారం కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. ముంబయిలో పెట్రోల్ ధర ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరింది. డీజిల్ ధర రూ. 79.99కి చేరుకుంది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.

Comments

comments